మరో రెండు రోజుల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

heavy-rain

భారీ వర్షాలు ఏపీని వదిలిపెట్టడం లేదు. ఓ అల్ప పీడనం అవ్వగానే మరొకటి ఏర్పడి వరుసగా వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం రాయలసీమ లో గత నెల రోజులుగా వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగుతున్నాయి. చేజేర్ల, అనంతసాగరం, ఏఎస్​పేట మండలాల్లో వాగులు పొంగుతుండటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇళ్లు నీటమునగడంతో.. ప్రజలు తీవ్ర అపస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతలలో ఉన్న గిరిజనుల పరిస్దితి మరి దారుణంగా ఉంది. ఎడతెరిపి ‌లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎటు చూసిన నీరే కనిపిస్తోంది. ఎక్కడ చూసినా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదిలా ఉంటె ఇప్పుడు వాన గండం ఉత్తరాంధ్రఫై మొదలుకాబోతుంది.

దక్షిణ అండమాన్ సముద్రంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందని, ఆగ్నేయ-తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి తదుపరి 48 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది. దీని ప్రభావం ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలపై ఉంటుందని తెలిపింది. డిసెంబరు 3 రాత్రి నుంచి రెండ్రోజుల పాటు ఉత్తర కోస్తా, ఒడిశాలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.