11నెలల్లో విశాఖ రైల్వేజోన్‌ ను ప్రారంభించేలా చర్యలు

ఢిల్లీ : నేడు ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో రైల్వే మంత్రి పీయూష్ గోయల్మాట్లాడుతూ, విశాఖపట్టణం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గత నెల 27న ప్రకటించిన విషయం తెలిసిందే. సౌత్ కోస్ట్ రైల్వేగా నామకరణం చేసిన ఈ జోన్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను రైల్వే మంత్రి పీయూష్ గోయల్, రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ యాదవ్ వెల్లడించారు. విశాఖ రైల్వేజోన్ ను పదకొండు నెలల్లో ప్రారంభించేలా చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ జోన్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ఓఎస్ డీని నియమించామని, జోన్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసేందుకు సమయం పడుతుందని, ఈ ప్రక్రియ మొత్తం మూడేళ్లలో పూర్తి చేసేందుకు క‌ృషి చేస్తున్నట్టు చెప్పారు.