సిగ్నల్ లోపం కారణంగానేరైలు ప్రమాదం: రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక

railway-dept-says-signal-defect-caused-odisha-train-accident

ఒడిశా: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక రూపొందించింది. సిగ్నల్ లోపం కారణంగానే రైలు ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ ఆ నివేదికలో వెల్లడించింది. లూప్ లైన్ లో ఆగి ఉన్న గూడ్సు రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టిందని వివరించింది. మెయిన్ లైన్ పై వెళ్లేందుకే కోరమాండల్ కు సిగ్నల్ ఇచ్చారని, కానీ, కోరమాండల్ ఎక్స్ ప్రెస్ పొరపాటున లూప్ లైన్ లోకి వెళ్లిందని పేర్కొంది.

లూప్ లైన్ లో ఉన్న గూడ్సు రైలును కోరమాండల్ ఢీకొట్టగా, బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయని రైల్వే శాఖ తెలిపింది. అదే సమయంలో బెంగళూరు-హౌరా ఎక్స్ ప్రెస్ రైలు వచ్చిందని, దాంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిందని వివరించింది.