వాయనాడ్‌ ముంపుప్రాంతాల్లో రాహుల్‌ పర్యటన

RAHUL GANDHI
RAHUL GANDHI


వాయనాడ్‌ (కేరళ): కేరళప్రాంతంలో వరదభీభత్సం హృదయ విదా రకంగా ఉందని కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. వరదలతో ముంచెత్తిన వాయనాడునియోజకవర్గపరిసరాలను ఇతర జిల్లాలను ఆదివారం ఆయన సందర్శించారు. బాధితకుటుంబాలతో మాట్లాడి నష్టం వివరాలను తెలుసుకున్నారు. కేరళలో జరిగిన భారీ వరదముంపునకు మొత్తం 68 మంది చనిపోయారని పార్టీ నేతలు రాహుల్‌కు సమాచారం ఇచ్చారు. తన పార్ల మెంటరీ నియోజకవర్గం మొత్తం పర్యటించిన రాహుల్‌ వరదముంపు వాయ నాడ్‌కు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వారుకోలుకునేవిధంగా తమ శాయశక్తులా కృషిచేసి వారిని ఆదుకుంటామని వాయనాడు ట్విట్టర్‌ఖాతానుంచి రాహుల్‌ ట్వీట్‌చేసారు. నీలంబూరు, మాంపాడ్‌, ఎడవన్నప్పర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంరం మాలాప్పురం కలెక్టరేట్‌లో సమావేశంలో పాల్గొన్నారు. మాంపాడ్‌ కళాశాల సహాయశిబిరానికి వెళ్లానని, వరద బాధి తులను పరామర్శించినట్లు వెల్లడించారు. కోజికోడ్‌ఎయిర్‌పోర్టులో విమానం దిగిన వెంటనే ఆయన వాయనాడుకు తరలివచ్చారు.

గతవారంలోనే రావాల నుకున్నా ఆయన సహాయ కార్యక్రమాలకు ఇబ్బంది కలుగకూడదన్న భావనతో వాయిదావేసుకున్నారు. మరికొన్నిరోజులుపాటు తన లోక్‌సభ నియో జకవర్గం లోనే ఉంటానని, తన నియోజకవర్గంలో ఎక్కువభాగం వరద ముంపునకు గుర యిందన్నారు. జిల్లా,రాష్ట్ర అధికారులతో పునరావాస కార్యక్రమాలపై సమీక్షిస్తా మన్నారు. అంతకుముందే వాయనాడుపై తాను ప్రధానమంత్రి నరేంద్రమోడీతో మాట్లాడానని ట్విట్టర్‌లోపేర్కొన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తన సమీక్ష సమావేశంలో కొన్నిప్రాంతాల్లో వరదలు తగ్గాయని, వర్షాలు కూడా తగ్గినట్లువెల్లడించారు వాయనాడు, కన్నూరు, కాసర్‌గడ్‌జిల్లాల్లో తగ్గుముఖం పట్టాయన్నారు.మరో ఆరు జిల్లాల్లో ఆరెంజ్‌ హెచ్చరికలు జారీచేసినట్లు వివ రించారు. సంఘ వ్యతిరేకశక్తులు తప్పుడు సందేశాలు పంపిస్తున్నాయని, కేరళ ప్రయోజనాలదృష్ట్యా అవేమీ పట్టించుకోవద్దని సిఎం వెల్లడించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/