అమేథీలో పర్యటించిన రాహుల్‌

Rahul Gandhi
Rahul Gandhi

న్యూఢిల్లీ: రాహుల్‌ గాంధీ బుధవారం అమేథీ నియోజక వర్గంలో పర్యటించారు. ఇక్కడకు రావడం తన సొంత ఇంటికి వచ్చినట్లుందని ఆయన ట్వీట్‌ చేశారు. అమేథి పర్యటనలో భాగంగా రాహుల్‌ గౌరిగంజ్‌లోని నిర్మల దేవి షైక్షిన్‌ సంస్థాన్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తల నివాసాలను సందర్శించి వారి కుటుంబాలను పరామర్శించారు. మృతి చెందిన కార్యకర్తలకు నివాళులు అర్పించారని అమేథి కాంగ్రెస్‌ ప్రతినిధి అనిల్‌ సింగ్‌ తెలిపారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/