జలియన్‌ వాలాబాగ్‌ వీరులకు రాహుల్‌ నివాళి

rahul gandhi
rahul gandhi


న్యూఢిల్లీ: జలియన్‌ వాలాబాగ్‌ ఊచకోత జరిగి సరిగ్గా ఇవాల్టికి వంద సంవత్సరాలు పూర్తిఅయింది. ఏప్రిల్‌ 13, 1919న ఈ ఊచకోత జరిగింది. ఆ ఊచకోతలో ఎక్కడ చూసినా గుట్టగుట్టలుగా శవాలు, ఒక భయానక వాతావరణం నెలకొంది. కాని జలియన్‌ వాలా బాగ్‌ ఘటనకు కారణమైన జనరల్‌ డయ్యర్‌ దీనిపై ఎప్పుడూ పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడం గమనార్హం.
ఐతే ఈ రోజు రాహుల్‌ గాంధీ జలియన్‌వాలా బాగ్‌ ఊచకోతలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని వారికి నివాళి సమర్పించారు. ఆ ఉదంతం జరిగి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన నివాళి అర్పించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/