ఈనెల 10న అమేథీలో పర్యటించనున్న రాహుల్‌!

Rahul Gandhi
Rahul Gandhi

న్యూఢిల్లీ: రాహుల్‌గాంధీ అమేథీ నియోజకవర్గంలో పర్యటన ఖరారైంది. ఈనెల 10న ఆయన అమేథిలో ఒకరోజు పర్యటించనున్నారు. రాహుల్‌తో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పర్యటించనున్నట్లు పార్టీ నేత ఒకరు తెలిపారు. అయితే ఇటివల అమేథీలో ఓటమి చవిచూసిన రాహుల్ గాంధీ ఆ నియోజకవర్గంలో పర్యటించనుడటం ఇదే తొలిసారి.
రాజీవ్ హత్య తర్వాత సోనియాగాంధీ 1999లో అమేథీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2004 నుంచి 2018 వరకూ రాహుల్ వరుసగా మూడుసార్లు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. రాహుల్ అమేథీలో ఈసారి ఓటమి చవిచూసినా కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి భారీ ఆధిక్యంతో గెలిచారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/