తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం సందర్బంగా తెలుగు లో ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ

rahul telangana formation day tweet

తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ పెట్టి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు(జూన్ 2) తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం. సుదీర్ఘ పోరాటం, అలుపెరుగని ఉద్యమం, ఎందరో బలిదానాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. నేటితో ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకొని , తొమ్మిదోవ ఏటా అడుగుపెట్టింది. ఈ సందర్భాంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భవ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.

తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భవ వేడుకలు జరుపుకుంటున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు గవర్నర్​ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు అన్ని పార్టీల నేతలు , సినీ ప్రముఖులు, బిజినెస్ రంగం వారు , క్రీడా కారులు ఇలా అంత కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు చెప్పారు. “తమ పోరాట స్ఫూర్తితో యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమైన నా తెలంగాణ సోదరసొదరీమణులందరికీ #TelanganaFormationDay శుభాకాంక్షలు. ఈ చారిత్రాత్మక రోజున అమరవీరుల, వారి కుటుంబసభ్యుల త్యాగాలను స్మరించుకుందాం.” అంటూ తెలుగులో ట్వీట్ చేసి ఆకట్టుకున్నారు.

తమ పోరాట స్ఫూర్తితో యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమైన నా తెలంగాణ సోదరసొదరీమణులందరికీ #TelanganaFormationDay శుభాకాంక్షలు

ఈ చారిత్రాత్మక రోజున అమరవీరుల, వారి కుటుంబసభ్యుల త్యాగాలను స్మరించుకుందాం.— Rahul Gandhi (@RahulGandhi) June 2, 2022