రాహుల్‌ పై దాడి.. నిందితుల కోసం గాలింపు

బెంగళూరులో ఎమ్మెల్యే సోదరుడు

Rahul sipligunj attack case
Rahul sipligunj attack case

హైదరాబాద్‌: ప్రముఖ సింగర్‌, తెలుగు బిగ్‌బాస్‌ 3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌పై ఇటీవల హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో దాడి జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ దాడిలో గాయపడిన తర్వాత మొదట ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత రాహుల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఓటి, గచ్చిబౌలి పోలీసులు, ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన తాండూరు ఎమ్యెల్యె రోహిత్‌రెడ్డి సోదరుడు రితీశ్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు బెంగళూరుకు పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు వారి కోసం అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. కాగా, నిందితులు అక్కడి నుంచి ముందస్తు బెయిలు కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/