రాహుల్‌ చెప్పితే పోటీ చేస్తా!

Kushboo
Kushboo

చెన్నై: ప్రముఖ సినీనటి ఖుష్బూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆదేశిస్తే తమిళనాడులోని ఏ లోక్‌సభ నియోజకవర్గంలో నుండైనా పోటీ చేస్తానని ఆమె తెలిపారు. అయితే తిరుచ్చి లోక్‌సభ నియోజవర్గంలో పోటీకిగా ఖుష్పూ పేరుతో టీఎన్‌సీసీ సాహిత్య విభాగం ఉపాధ్యక్షుడు మయిలై అశోక్‌ కుమార్‌ దరఖాస్తు చేశారు. దీనికి తోడు లోక్‌సభ ఎన్నికల్లో ఖుష్పూ పోటీ చేయడం ఖాయమంటూ నెల రోజులు వార్తలు వెలువడు తున్నాయి. ఈ నేపథ్యంలో ఖుష్పూ పేరుతో తిరుచ్చిలో పోటీకి దరఖాస్తు చేయడం సంచలనం కలిగించింది. ఈ విషయమై ఖుష్బూ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం గురించి తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదేని, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆదేశిస్తే ఏ నియోజకవర్గంలోనైనా పోటీ చేయడానికి తాను సిద్ధమేనని తెలిపారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/