నాన్న మిమ్మల్ని ప్రతిరోజు మిస్‌ అవుతున్నా

నేడు రాజీవ్ 76వ జయంతి

rahul-pays-tributes-to-his-father-rajeev-gandhi

న్యూఢిల్లీ: ఈరోజు మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 76వ జయంతి. ఈనేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఢిల్లీలోని వీర్‌భూమి వ‌ద్ద నివాళి అర్పించారు. ‘భవిష్యత్తు గురించి దూరాలోచన చేసిన నేత’గా ఆయన్ను అభివర్ణించిన రాహుల్, ఇప్పటికీ అటువంటి వ్యక్తిని మిస్ అవుతున్నామని అన్నారు. ‘రాజీవ్ గాంధీ భావితరాల గురించి ఆలోచించిన వ్యక్తి. ఎంతో దూరదృష్టితో ఆలోచించారు. అన్నింటికన్నా మించి, సాటివారిపై ఎంతో ప్రేమను, అభిమానాన్ని కనబరిచే వ్యక్తి. ఆయన్ను తండ్రిగా పొందగలగడం నేను చేసుకున్న అదృష్టం, నాకెంతో గర్వకారణం. ఈ రోజు, ప్రతి రోజూ ఆయన్ను మిస్ అవుతూనే ఉంటాం’ అని తన సోషల్ మీడియాలో రాహుల్ వ్యాఖ్యానించారు.


మరోవైపు ప్రధాని నరేంద్రమోడి కూడా రాజీవ్ ను గుర్తు చేసుకుని నివాళులు అర్పించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నానని మోడి ట్వీట్ చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/