దక్షిణాది పై కన్నేసిన రాహుల్‌

Rahul Gandhi
Rahul Gandhi

స్యూడిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈసారి లోక్‌ సభ ఎన్నికల్లో ఎక్కడి నంచి పోటీ చేస్తారన్న విషయమై క్టారిటీ వచ్చేసింది. ఉత్తరప్రధేశ్‌ లోని అమేథీతో పాటు కేరళలోని వాయనాడ్‌ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఏకే అంటోని తెలిపీరు. ఈ రెండు స్తానాల నుంచి పోటీకి రాహుల్‌ నామినేషన్‌ దాఖలు చేస్తారని చెప్పారు. . ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను ప్రకటించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో వాయనాడ్‌ ఏర్పడింది. అప్పటి నుంచి ఈ ప్రాంతం రాంగ్రెస్‌ పార్టీకి కంచెకోటగా ఉంది.2009,2014 లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుత ఎంఐ షానవాజ్‌ ఇక్కడ భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే గతేడాది ఆయన చనిపోవడంతో ఈ స్థానం ఖాళీగా ఉండిపొయింది.

మరిన్నీ తాజా జాతియ వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/news/national/