రేపటి నుండి తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర

short-break-for-bharath-jodo-yatra

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర..రేపటి నుండి తెలంగాణ లో మొదలుకాబోతుంది. దీనికి సంబదించిన అన్ని ఏర్పాట్లను పార్టీ నేతలు పూర్తి చేసారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా సరిహద్దు వద్దకు రేపు ఉదయం రాహుల్ పాదయాత్ర చేరుకుంటుంది. కర్ణాటక నుంచి తెలంగాణలోకి అడుగుపెట్టనున్న రాహుల్‌ కు సుమారు 50 వేలమందితో ఘనస్వాగతం పలికేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది.

దీపావళి సందర్భంగా 24, 25, 26న యాత్రకు విరామం ఇవ్వనున్నారు. మళ్లీ 27 వ తేదీ నుంచి మక్తల్‌, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల నియోజకవర్గాల మీదుగా 30 వరకు యాత్ర సాగనుంది. నారాయణపేట జిల్లా కృష్ణా సరిహద్దు నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ సమీపంలోని బూర్గులచౌరస్తా వరకు 110 కిలోమీటర్లు రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. పాలమూరు జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో యాత్ర సాగుతుండటంతో మిగిలిన నాయకులు, కార్యకర్తలు విడతలవారీగా పాదయాత్రలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు.