లక్ష ఓట్ల లీడింగ్‌లో రాహుల్‌

rahul gandhi
rahul gandhi

తిరువనంతపురం: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కేరళలోని వయనాడ్‌ నుంచి లక్ష పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు వెలువడిన ట్రెండ్స్‌ ప్రకారం కేరళలోని 20 స్థానాల్లో కాంగ్రెస్‌ 19 స్థానాల్లోనూ, అధికార సిపిఎం సారథ్యంలోని ఎల్‌డిఎఫ్‌ ఒక స్థానంలోనూ ఆధిక్యంలో ఉన్నాయి.
కాగా, యూపిలోని కాంగ్రెస్‌ కంచుకోట అమేథి నుంచి కూడా పోటీ చేస్తున్న రాహుల్‌ అనూహ్యంగా ఆ నియోజకవర్గంలో వెనుకంజలో ఉంది. రాహుల్‌పై పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి, బిజెపి అభ్యర్థి స్మృతి ఇరానీ 7600 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

తాజా ఏపి ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/