బిజెపి కార్యకర్తలకు రాహుల్ ఫ్లయింగ్‌ కిస్సెస్..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పాదయాత్రను పూర్తి చేసిన రాహుల్ ..ప్రస్తుతం రాజస్థాన్ లో పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బిజెపి కార్య కర్తలకు ఫ్లయింగ్‌ కిస్సెస్ ఇచ్చి తన ప్రేమను వ్యక్తం చేసారు.

గత కొద్దీ రోజులుగా రాహుల్ తన యాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వెళ్లిన ప్రతి చోట రాహుల్ కు ప్రజలు బ్రహ్మ రధం పడుతున్నారు. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ లో పాదయాత్ర చేస్తున్నారు. ఆ సమయంలోనే ఝలావర్ లో ఆయన పాదయాత్ర చేస్తుండగా, బీజేపీ కార్యాలయం తరసపడింది. దీంతో అక్కడున్న వారికి రాహుల్ ఫ్లయింగ్‌ కిస్సెస్ ఇచ్చారు. బీజేపీ కార్యాలయ భవనంపై ఉన్న కొందరు రాహుల్ గాంధీకి బీజేపీ జెండాలు చూపారు. ఆ సమయంలోనే వారికి ప్రేమని పంచుతున్నట్లు రాహుల్ ముద్దులు విసిరారు. అనంతరం ఆయన పక్కన ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీ కార్యకర్తలకు అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.