రాహుల్‌ నామినేషన్‌ పత్రాలు సరైనవే..

rahul gandhi
rahul gandhi


లక్నో: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు దాఖలు చేసిన అఫిడవిట్‌, నామినేషన్‌ పత్రాలు సరైనవేఅని అమేథి రిటర్నింగ్‌ అధికారి రామ్‌ మనోహర్‌ మిశ్రా వెల్లడించారు. ఆమేధిలో రాహుల్‌ దాఖలు చేసిన నామినేషన్‌ పత్రంపై అభ్యంతరాలు వ్యక్తమైన విషయం విదితమే. బ్రిటన్‌లో రిజిస్టర్‌ ఐన కంపెనీ ప్రకారం ఆయన ఈ దేశ పౌరుడు కాదని, అందుకే ఆయన ఎన్నికలకు అనర్హుడు అంటూ న్యాయవాది రవిప్రకాశ్‌ ఆరోపించారు. రాహుల్‌ సమర్పించిన విద్యార్హత పత్రాల్లోనూ అనేక తప్పులున్నాయని, ఒరిజినల్‌ విద్యాపత్రాలను సమర్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
ఈ నేపథ్యంలో ఇవాళ రాహుల్‌ తరఫు న్యాయవాది కౌశిక్‌, కాంగ్రెస్‌నేత విద్యార్హతలను వెల్లడించారు. రాహుల్‌ ఎంఫిల్‌ సర్టిఫికేట్‌ను సమర్పించినట్లు ఆయన తెలిపారు. రాహుల్‌ ఇండియాలోనే పుట్టారని, ఆయనకు ఇండియన్‌ పాస్‌పోర్టు ఉందని, మరో దేశంలో ఆయనకు పౌరసత్వం లేదని, రాహుల్‌ పాస్‌పోర్ట్‌, ఓటర్‌ ఐడి, ఇన్‌కంట్యాక్స్‌, అన్ని ఇండియాకు చెందినవే అని న్యాయవాది కౌశిక్‌ తెలిపారు. చివరకు అమేథి రిటర్నింగ్‌ అధికారి రాహుల్‌ నామినేషన్‌ సరిగానే ఉందని ఇవాళ ప్రకటించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/