రాహుల్‌ గాంధీ జోడో యాత్రకు వర్షం బ్రేక్ ఇచ్చింది

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కు వర్షం బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం రాహుల్ యాత్ర గత కొద్దీ రోజులుగా జమ్మూలో కొనసాగుతుంది. గడ్డకట్టే చలిలోనే రాహుల్ తన యాత్రను కొనసాగిస్తూ వస్తున్నారు. కాగా బుధ‌వారం రాహుల్ గాంధీ పాద‌యాత్ర ప్రారంభమైన కాసేపటికే బ‌నిహార్ లో భారీ వర్షం ప‌డ‌టంతో రాహుల్ గాంధీ జ‌మ్ముకు తిరిగి వ‌చ్చారు. వ‌ర్షం త‌గ్గితే ఈరోజు యాత్ర కొన‌సాగిస్తారా.. మ‌ళ్లీ రేపు ప్రారంభిస్తారా అనే విష‌యం ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం మీద భార‌త్ జోడో యాత్ర‌కు ప్ర‌జ‌ల‌ మంచి స్పంద‌న ల‌భిస్తున్న‌ట్లు కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు.

కొన్ని చోట్ల వ‌ర్షంను సైతం లెక్క‌చేయ‌కుండా రాహుల్ జోడో యాత్ర కొన‌సాగిన తీరు నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి. ఎక్క‌డికి వెళ్లినా వేల సంఖ్య‌లో జ‌నం రాహుల్ గాంధీ యాత్ర‌లో భాగ‌స్వాములు అవుతున్నారు. ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు సైతం రాహుల్ జోడో యాత్ర‌లో పాల్గొంటున్నారు. ఇప్పటీకే పలు రాష్ట్రాలను రాహుల్ కవర్ చేసుకుంటూ జమ్ముకు చేరుకున్నాడు.