తెలంగాణ లో ప్రతి మూడు నెలలకోసారి రాహుల్ పర్యటన..?

తెలంగాణ రాష్ట్రం ఫై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో మే 6, 7 తేదీల్లో తెలంగాణలో రాహుల్ పర్యటించనున్నారు. మే 6న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. వ్యవసాయ సమస్యలపై రైతు సంఘర్షణ సభ జరుగుతుంది. మే 7న హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలతో రాహుల్ సమావేశం అవుతారు. కేవలం ఈ రెండు రోజలు కాదు ప్రతి మూడు నెలలకోసారి రాహుల్ తెలంగాణ లో పర్యటించబోతారని రేవంత్ రెడ్డి అంటున్నారు. వరంగల్ లో సభ స్థలాన్ని పరిశీలించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… అనంతరం మాట్లాడుతూ.. ఆనాడు రజాకార్లు, ఇప్పుడు కేసీఆర్ ప్రజలను దోచుకుంటున్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడింది వరంగల్ గడ్డ అని.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం సభ నిర్వహించట్లేదని వెల్లడించారు.

రాహుల్ గాంధీ సూచన మేరకు వరంగల్ గడ్డపై సభ నిర్వహిస్తున్నామని.. విప్లవాలకు పునాది వేసింది ఓరుగల్లు అన్నారు రేవంత్. బ్యాంకు రుణాల మిత్తి పెరిగి, మనస్తాపంతో రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని వెల్లడించారు. వరంగల్ లో 22 మంది మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకుంటే స్పందించలేదు.. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడంవల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. బెల్ట్ షాపులు తెచ్చి తాగుబోతుల తెలంగాణ చేస్తున్నాడన్నారు. ఇక ప్రతీ మూడు నెలలకు ఓ సారి తెలంగాణ కు రాహుల్ గాంధీ రానున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.