జాతీయ గిరిజన ఉత్సవాలో పాల్గొన్న రాహుల్‌

డోలు వాయిస్తూ.. గిరిజనులతో మమేకం

Rahul Gandhi
Rahul Gandhi

రాయ్ పూర్ : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ జాతీయ గిరిజన ఉత్సవాలను ప్రారంభించారు. రాయ్ పూర్ లోని సైన్స్ కాలేజీ మైదానంలో ప్రారంభమైన ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు జరుగనున్నాయి. ఈ వేడుకల్లో రాహుల్ గాంధీ గిరిజనులతో మమేకమైనారు. చేతిలో డోలు పట్టుకొని వాయిస్తూ.. వారి నృత్యాన్ని అనుకరించారు. రాహుల్ నృత్యం చేశారు. ఈ సందర్బంగా రాహుల్ ప్రసంగిస్తూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో, రాష్ట్రాల్లో చెలరేగుతున్న ఆందోళనలను ప్రస్తావించారు.ఖఇప్పుడు దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీకు తెలుసు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ మందగమనం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నామని కూడా తెలుసు. నేను చెప్పదలచుకున్నదొక్కటే.. అన్ని జాతులు, మతాలు, తెగల ప్రజలను సమన్వయం చేసుకుంటూ వెళ్లకపోతే దేశాన్ని ముందుకు నడిపించలేంగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాహుల్ పాటు, రాష్ట్ర సీఎం భూపేశ్ భగేల్, లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ నృత్యోత్సవాల్లో ఏపీ, తెలంగాణతో పాటు మొత్తం 24 రాష్ట్రాల నుంచి నృత్యకారుల బృందాలు పాల్గొంటున్నాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/