లోక్‌సభ సభ్యుడిగా రాహుల్‌ ప్రమాణం

rahul gandhi
rahul gandhi


న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల అనంతరం సోమవారం 17వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజున ఎంపీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతుండగా..ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్‌ ఆయన చేత ప్రమాణం చేయించారు. తొలిరోజే రాహుల్‌ సభకు హాజరుకాకపోవడంతో వచ్చిన పలు సందేహాలపై రాహుల్‌ ట్వీట్టర్‌ వేదికగా స్పందించారు. లోక్‌సభ సభ్యుడిగా నాలుగోసారి నా ప్రయాణం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కేరళలోని వయనాడ్‌ ఎంపిగా కొత ఇన్నింగ్స్‌ ప్రారంభించబోతున్నాను అని సమాధానం ఇచ్చారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/