కేటీఆర్ ఇలాకాకు రాహుల్ గాంధీ ..

కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణ లో పర్యటించబోతున్నారు. కేటీఆర్ ఇలాకా అయినా సిరిసిల్ల లో రాహుల్ గాంధీ పర్యటించబోతున్నారు. సెప్టెంబర్ 17 న సిరిసిల్లలో “విద్యార్ధి యువజన డిక్లరేషన్” విడుదల చేయనున్నారు రాహుల్ గాంధీ. కేసి వేణుగోపాల్ నివాసంలో కొనసాగుతున్న కీలక సమావేశం జరిగింది. తెలంగాణలో పార్టీ పరిస్థితుల పై రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సి.ఎల్.పి నాయకుడు భట్టి విక్రమార్క చర్చలు జరిపారు. అంతర్గత విభేదాలు, సమన్వయ లోపాలు, నేతలు ఏకపక్షంగా వ్యవహారిస్తున్న తీరు పై చర్చ జరిగింది.

రానున్న రోజుల్లో పార్టీలో పెద్దఎత్తున చేరికలుంటాయని..ఆ జిల్లాల్లో ఉన్న పరిస్థితులను బట్టి నేతలను పార్టీలో చేర్చుకుంటున్నట్లు రేవంత్ అన్నారు. పార్టీలో చేరే వారి గురించి ముందే తెలుస్తుండడంతో టీఆర్ఎస్ వారిపై కేసులు పెట్టిన వేధిస్తోందని ఆరోపించారు. విష్ణువర్ధన్ రెడ్డి తనను కూడా లంచ్ కు ఆహ్వానించారని.. మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. త్వరలోనే హైదరాబాద్ లో విష్ణువర్ధన్ రెడ్డి బహిరంగ సభ పెడతారని..దానికి పీసీసీ అధ్యక్షుడిగా అన్ని అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు.

జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చించామని సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుతం అంతా సద్దుమణిగిందన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు ఉంటాయని చెప్పారు. బీజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా టీఆర్ఎస్ -బిజెపి పార్టీ దోస్తీ బయటపడిందన్నారు. ప్రధాని మోడీ విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తారని ఆశించాం కానీ..అలా జరగలేదన్నారు. ఇక టీఆర్ఎస్- బీజేపి పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొలేదని..రెండు ఒక్కటేనని విమర్శించారు.