అమేథిలో ఓటమిపై రిపోర్టుకు రాహుల్‌ టీమ్‌

rahul gandhi
rahul gandhi

అమేథి: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ..ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నియోజకవర్గంలో దారుణంగా ఓడిన సంగతి విదితమే. ఆ నియోజకవర్గం నుంచి బిజెపి నేత స్మృతి ఇరానీ విజయం సాధించారు. ఐతే తన ఓటమికి కారణాలను తెలుసుకునే పనిలో ఉన్న రాహుల్‌, అమేథి ప్రజలు తనను తిరస్కరించడానికి గల కారణాలను కనిపెట్టేందుకు కాంగ్రెస్‌ నేతలు ఆ నియోజకవర్గానికి వెళ్లినట్లు సమాచారం. గురువారం ఇద్దరు కాంగ్రెస్‌నేతలు రాహుల్‌ ఓటమిపై రిపోర్టు తెచ్చేందుకు వెళ్లారు. స్మృతి ఇరానీ, రాహుల్‌పై 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గాంధీ కుటుంబానికి కంచుకోటలాంటి అమేథిలో రాహుల్‌ ఓడిపోవడం ఆశ్చర్యాన్ని కల్గిస్తున్నది. ఏఐసిసి కార్యదర్శి బుబైర్‌ ఖాన్‌, రా§్‌ు బరేలి ఇంచార్జ్‌ కేఎల్‌ శర్మలు..అమేథిలో రాహుల్‌ ఓటమిపై రిపోర్ట్‌ ఇవ్వనున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/