రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదని రాహుల్‌ స్పష్టం!

Rahul Gandhi
Rahul Gandhi


న్యూఢిల్లీ: పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ తాను తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదని ఆ పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. రాజస్థాన్‌ సియం అశోక్‌ గెహ్లాట్‌ వంటి పార్టీ సీనియర్‌ నేతలు సముదాయిస్తున్నప్పటికి ఆయన వినే పరిస్థితిలో లేరు. ఇవాళ ఉదయం సియం గెహ్లాట్‌ మాట్లాడుతూ..ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన మాత్రమే పార్టీని నడిపించగలరని, దేశ శ్రేయస్సు పట్ల ఆయనకు చిత్తశుద్ధి ఉందని, బాధ్యత గల పౌరుడెప్పుడూ రాజీపడడు. మరెవ్వరూ అతడితో సాటిరారని పేర్కొన్నారు.
గెహ్లాట్‌ ప్రకటనపై రాహుల్‌ని మీడియా ప్రశ్నించగా..ఇప్పటికే తన నిర్ణయం స్పష్టంగా చెప్పానని, దీనిపై ఆలోచించడానికి ఏమీ లేదని అన్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సియంలతో తన సమావేశం నేపథ్యంలోనే రాహుల్‌ ఈ మేరకు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇవాళ మధ్యాహ్నం రాహుల్‌ గాంధీని కలుసుకోవాలని ముఖ్యమంత్రులంతా నిర్ణయం తీసుకున్నారు. రాహుల్‌ రాజీనామాతో పాటు పార్టీలో ఆయన పాత్రపై సస్పెన్స్‌ కొనసాగుతున్న నేపథ్యంలో వీరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజా మొగ్గ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/kids/