పుల్వామా ఉగ్రదాడి.. బిజెపికి రాహుల్‌ ప్రశ్నలు

rahul gandhi
rahul gandhi

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్ర దాడి జరిగి ఈరోజుతో ఏడాది అవుతున్న సందర్భంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ బిజెపిపై ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు. 40 మంది జవాన్లు బలిగొన్న పుల్వామా దాడి వల్ల ఎవరు లాభ పడ్డారు?… విచారణలో ఇప్పటి వరకు ఏం తేల్చారు?… భద్రతా వైఫల్యానికి బిజెపి ప్రభుత్వంలో ఎవరు బాధ్యత వహిస్తారు?.. అని రాహుల్‌ ప్రశ్నించారు. జమ్ముశ్రీనగర్‌ జాతీయ రహదారిపై 2019 ఫిబ్రవరి 14 న భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వారుపై లేథిపురా వద్ద కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 40 మంది జవాన్లు మరణించారు. 35 మంది జవాన్లు గాయపడ్డారు. ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థ జైషేఇమహ్మద్‌ దాడికి బాధ్యత ప్రకటించింది. దాడి ఘటన జరిగి ఏడాది కావొస్తున్నా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టిందో వెల్లడించాలని రాహుల్‌ ప్రశ్నించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:
https://www.vaartha.com/andhra-pradesh/