చిదంబరాన్ని కలిసిన రాహుల్‌ గాంధీ, ప్రియాంక

రిమాండ్ ఖైదీగా ఉన్న చిదంబరం

Rahul with priyanka
Rahul with priyanka

న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరాన్ని కాంగ్రెస్‌ పార్టీ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు కలిశారు. ఈ ఉదయం జైలు వద్దకు చేరుకున్న వారు, నేరుగా లోపలికి వెళ్లి, దాదాపు 20 నిమిషాలకు పైగా చిదంబరంతో సమావేశం అయ్యారు. ఆయన్ను పరామర్శించిన ప్రియాంక , త్వరలోనే కష్టాలు తీరుతాయని భరోసా ఇచ్చినట్టు సమాచారం. జైలు నుంచి బయటకు వచ్చిన ప్రియాంక , రాహుల్, తమ కోసం ఎదురు చూస్తున్న మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. వారి రాక సందర్భంగా జైలు ముందు భద్రతను పెంచారు. కాగా ఐఎన్‌ఎస్‌ మీడియా కేసులో గత మూడు నెలలుగా తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/