శశిథరూర్ కేరళకు దొరకడం వరం

తిరువనంతపురం: కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కు తులాభారం జరుగుతున్నప్పుడు ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగి రక్తస్రావమైన విషయం అందరికీ తెలిసిందే . ఐనా ఆయన విశ్రాంతి తీసుకోకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఐతే ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ శశిథరూర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. రాహుల్ మాట్లాడుతూ..ఆయన తలకు గాయమైందని తెలిసి భయపడినట్లు చెప్పారు. ఆయన మళ్లీ ప్రచారంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, కేరళ ప్రజల కోసం ఆయన పార్లమెంటులో పోరాడుతున్నారని, ఆయన కేరళకు దొరకడం వరం అని రాహుల్ పేర్కొన్నారు. శశిథరూర్‌ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు పరామర్శించారు.
తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/