రాహుల్‌గాంధీ బ్యాట్‌ పట్టిన వేళ

rahul cricket in haryana


న్యూఢిల్లీ: శుక్రవారం మహారాష్ట్ర, హర్యాణాలోని మహేంద్రగఢ్‌ అసెంబ్లీ నియోజవర్గ ఎన్నికల సమావేశంలో పాల్గొనవలసిన సోనియాగాంధి ఆరోగ్యం సహకరించకపోవటం వల్లన ఆమె రాలేకపొయింది. ఆమెకు బదులుగా రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం ముగించుకొని తిరిగి తన హెలికాప్టర్‌లో బయలుదేరగా వాతావరణం అనుకూలించక చాపర్‌ రివాడీలోని కేఎల్పీ కాలేజీ మైదానంలో అత్యవసరంగా దించారు. అదే సమయంలో అక్కడ మైదానంలో యువకులు క్రికెట్‌ ఆడుతుండటంతో రాహుల్‌గాంధీ కూడా కాసేపు క్రికెట్‌ ఆడారు. యువకులు బౌలింగ్‌ చేయగా…రాహుల్‌గాంధీ బ్యాటింగ్‌ చేశారు. ఆ సమయంలో అక్కడవున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు వీడియోతీసి సోషల్‌ మీడియాలో అప్‌లొడ్‌చేశారు. అప్పటికి వాతావరణం అనుకూలించకపోవడంతో రాహుల్‌గాంధీ రోడ్డు మార్గాన ఢిల్లీ వెళ్లారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/