మళ్లీ ఆ బాధ్యతలు చేపట్టే ఉద్దేశం లేదు

కాంగ్రెస్‌ అధినేత్రి ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి

rahul gandhi
rahul gandhi

న్యూఢిల్లీ: గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్‌ తాత్కాలిక చీఫ్‌గా సోనియా గాంధీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ పగ్గాలను మరోసారి చేపట్టడంపై ఎంపీ రాహుల్‌ గాంధీ స్పందించారు. తాను పార్టీ పదవికి రాజీనామా చేశానని, మళ్లీ ఆ బాధ్యతలు చేపట్టే ఉద్దేశం లేదని రాహుల్‌ స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వ బాధ్యతలను తిరిగి రాహుల్‌ స్వీకరిస్తారన్నా ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. నాయకత్వ బాధ్యతను రాహుల్‌ స్వీకరించే పరిస్థితి లేకపోవడంతో ఈ అంశంపై ఏప్రిల్‌లో జరిగే కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. పార్టీ చీఫ్‌ బాధ్యతలను తిరిగి స్వీకరించాలని పార్టీ ఒత్తిడి తెస్తే ఏమిటన్న ప్రశ్నకు రాహుల్‌ బదులిస్తూ కాంగ్రెస్‌ అధినేత్రి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/