విదేశి పర్యటనకు రాహుల్‌ గాంధీ..కాంగ్రెస్ కీలక సమావేశానికి దూరం

రాష్ట్రపతి ఎన్నికలు. పార్లమెంటు సమావేశాలకు ముందు రాహుల్ పర్యటన

Rahul Gandhi

న్యూఢిల్లీః కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. వ్యక్తిగత పర్యటన కింద ఆయన యూరప్ వెళ్లారు. ఆదివారం ఆయన తిరిగి రావచ్చని సమాచారం. రాష్ట్రపతి ఎన్నికలు, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరిగే ముందు ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు. మరోవైపు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడుల్లా ఆ పార్టీ ఏదో ఒక సంక్షోభంలో ఉండటం గమనార్హం. ఇప్పడు గోవాలో కాంగ్రెస్ పార్టీ పూర్తి సంక్షోభంలో ఉంది. దీంతో, మరోసారి పార్టీని వదిలేసి విదేశాలకు వెళ్లిపోయారంటూ రాహుల్ పై బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

మరోవైపు తన విదేశీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశానికి కూడా ఆయన దూరం కాబోతున్నారు. గురువారం నాడు పార్టీ సమావేశం కాబోతోంది. పార్టీ అధ్యక్షుడి ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

మే నెలలో రాహుల్ వెళ్లిన విదేశీ పర్యటన చాలా వివాదాస్పదమయింది. నేపాల్ రాజధాని ఖాట్మండూ నైట్ క్లబ్ లో ఆయన కనిపించారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. పార్టీ కష్టాల్లో ఉంటే రాహుల్ నైట్ క్లబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నాడని బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/