ఇప్పటికే ప్రజలను ప్రమాదంలోకి నెట్టారు

వ్యాక్సిన్‌పై కేంద్రం పారదర్శకంగా వ్యవహరించడం లేదు

Rahul Gandhi
Rahul Gandhi

న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకురాలేకపోవడంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అసంతృప్తి వ్యక్తిం చేశారు. దేశంలో కరోనా 33 లక్షల మందికి పైగా వ్యాప్తించిన వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదని, ఈ పరిస్థితి దేశాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టవచ్చని రాహుల్ హెచ్చరించారు.

కాగా, ఈ నెల 14న తన ట్విట్టర్ ఖాతాలో, వ్యాక్సిన్ పై కేంద్రం వ్యూహం ఏంటో, ఎప్పుడు తెస్తారో తెలియజేయాలంటూ రాహుల్ కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై దేశ ప్రజలకు ఓ స్పష్టమైన సమాచారం ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ లభిస్తే దాని ధర అందరికీ అందుబాటులో ఉండేలా తక్కువగా ఉండాలని, పంపిణీ కూడా పారదర్శకంగా సాగాలని ఆయన అన్నారు.

ఇటీవలి కాలంలో కరోనా వైరస్ విషయంలో రాహుల్ తనకు లభించే ఏ అవకాశాన్నీ వదులుకోవడంలేదు. కేసుల సంఖ్య 20 లక్షలు దాటగానే, తన ట్విట్టర్ టైమ్ లైన్ లోని పాత ట్వీట్ ను రీ పోస్ట్ చేసిన రాహుల్, తాను చెప్పినట్టే జరుగుతోందని వ్యాఖ్యానించారు. జూలై 17న కరోనా కేసుల సంఖ్య 10 లక్షలను తాకిన వేళ, ఆగస్టు 10 నాటికి ఈ కేసులు 20 లక్షలు అవుతాయని రాహుల్ హెచ్చరించారు. ఆయన అంచనా వేసినట్టే జరిగింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/