మత్స్యకారుల కోసం రాహుల్‌గాంధీ శుభవార్త

Rahul Gandhi
Rahul Gandhi

త్రిస్సూర్‌: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దేశవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులందరికి శుభవార్త చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా ఓ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు కేరళలోని త్రిస్సూర్‌లో జరిగిన అఖిల భారత మత్స్యకారుల మహసభ నిర్వహించిన జాతీయ మత్స్యకార ప్రతినిధుల సమావేశంలో రాహుల్‌గాంధీ పాల్గొని ప్రసంగించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన మరుక్షణమే, దేశంలోని మత్స్యకారులందరికీ ఢిల్లీ కేంద్రంగా సొంతంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తాం… అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ హామీ నెరవేర్చి తీరతామని రాహుల పేర్కొన్నారు. తాను ప్రధాని మోడిలా మోసపూరిత హామీలు ఇవ్వబోనని రాహుల్ స్పష్టం చేశారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/