మే నెలలో తూర్పు లడఖ్ ప్రాంతంలోకి చైనా ఆర్మీ
చైనాతో నెలకొన్న పరిస్థితులను ప్రస్తావించిన రాహుల్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చైనా సరిహద్దులో విషయంపై ప్రధాని మోడిపై మండిపడ్డారు. జూన్ 15వ తేదీన గాల్వన్ లోయ వద్ద చైనాభారత్ సైనికుల మధ్య జరిగిన ఘర్షణ కంటే నెల రోజుల ముందే మే నెలలో తూర్పు లడఖ్ ప్రాంతంలోకి చైనా ఆర్మీ ప్రవేశించినట్లు తెలుపుతూ వచ్చిన ఓ వార్తను రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు. ఎల్ఏసీ వద్ద భారత భూభాగాన్ని చైనా దళాలు ఆక్రమించాయని భారత రక్షణశాఖ మాత్రం ఆ నిజాన్ని దాచిందని రాహుల్ చెప్పారు. కూగ్రంగ్ నాలా, గోగ్రా, పాన్గంగ్ సో ప్రాంతాల్లోకి మే నెల 17, 18వ తేదీల్లో చైనా ఆర్మీ వచ్చినట్లు రక్షణ శాఖ తెలిపిందని ఓ జాతీయ మీడియా పేర్కొంది. ఈ విషయంపై ప్రధాని ఎందుకు అసత్యాలు చెబుతున్నారని ఆయన ప్రశ్నించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/