అమేథిలో కాంగ్రెస్‌ తీరుపై స్మృతి ఈసికి ఫిర్యాదు

smriti irani
smriti irani

హైదరాబాద్‌: యూపిలోని అమేథిలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ స్థానం నుంచి బిజెపి తరఫున కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పోలింగ్‌ బూత్‌లను స్వాధీనంలోకి తీసుకుని, ఓటర్లను కాంగ్రెస్‌కు ఓటు వేసేలా మభ్య పెడుతున్నారని స్మృతి ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. ఓ మహిళ వీడియోను కూడా ఆమో ట్వీట్‌ చేశారు. ఈవిఎంలోని కాంగ్రెస్‌ బటన్‌ను బలవంతంగా ఒత్తించారని ఓ బామ్మ ఆ వీడియోలో ఆరోపించింది. ఈ వీడియోను స్మృతి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ట్వీట్‌ చేసింది. బూత్‌ ఆక్రమణ జరుగుతుందని ఆమె ఈసికి ఫిర్యాదు చేశారు.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/