పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారం, సభలు రద్దు

కరోనా కేసుల కారణంగా రాహుల్ గాంధీ నిర్ణయం

Rahul Gandhi
Rahul Gandhi

New Delhi: కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారం, నిర్వహించటం లేదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ ప్రకటించారు. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారీ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడంపై కలిగే అనర్థాలపై లోతుగా ఆలోచించాలని ఇతర రాజకీయ పార్టీల నేతలను ఆయన కోరారు.అన్ని పార్టీల నేతలు ఎన్నికల సభలను రద్దు చేసుకోవాలని సూచించారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/