ట్రాక్టరుపై పార్లమెంటుకు వచ్చిన రాహుల్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఆ రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న ఇవాళ పార్ల‌మెంట్‌కు ట్రాక్ట‌ర్‌పై వ‌చ్చారు. రైతుల సందేశాల‌ను పార్ల‌మెంట్‌కు మోసుకువ‌చ్చిన‌ట్లు రాహుల్ తెలిపారు. రైతు గొంతును ప్ర‌భుత్వం నొక్కిపెడుతోంద‌ని ఆరోపించారు.

పార్ల‌మెంట్‌లో రైతు చ‌ట్టాల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌కుండా అడ్డుకుంటోంద‌న్నారు. ఆ న‌ల్ల చ‌ట్టాల‌ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాల‌ని రాహుల్ డిమాండ్ చేశారు. కొత్త సాగు చ‌ట్టాలు కేవ‌లం ఇద్దరు, ముగ్గురు వ్యాపార‌వేత్త‌ల‌కు మాత్ర‌మే ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉన్న‌ట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ చట్టాల వల్ల రైతులకు మద్ధతు ధర రాదని రైతు సంఘాలు ఆరోపించాయి. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఆందోళనకు రాహుల్ గాంధీ మరోసారి మద్ధతు ప్రకటించారు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/