పోతురాజుల కొరడాతో సందడి చేసిన రాహుల్ గాంధీ

సంగారెడ్డిలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర

Rahul Gandhi donned avatar of ‘pothuraju’, whipped himself

హైదరాబాద్‌ః తెలంగాణలో తొమ్మిదో రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో రాహుల్ పాద యాత్ర చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి నిన్న యాత్ర సంగారెడ్డి జిల్లాలో ప్రవేశించింది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ కు ఘన స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు వెంట వస్తుండగా రాహుల్ గాంధీ యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ ఈ ఉదయం చాలా ఉత్సాహంగా కనిపించారు.

ఉదయం చిన్న పిల్లలతో కాసేపు కరాటే ఆడిన ఆయన.. తనకు స్వాగతం పలికిన గిరిజన నృత్యకారులతో కాలు కదిపారు. అలాగే, బోనాల ముంగిట పోతురాజుల విన్యాసం కూడా రాహుల్ చూశారు. తెలంగాణలో సంస్కృతిలో భాగమైన బోనాలు, పోతురాజుల గురించి జగ్గారెడ్డి.. కాంగ్రెస్ అగ్రనేతకు వివరించారు. జగ్గారెడ్డి పోతురాజు ఆట ఆడారు. ఎలా కొరడా ఝుళిపించాలో చెప్పారు. దాంతో రాహుల్ కూడా కొరడా తీసుకొని పోతురాజు ఆట ఆడారు. కొరడా కొట్టుకోవడంతో ఆ ప్రాంతంలోని కార్యకర్తల అరుపులు, కేరింతలతో దద్దరిల్లింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/