కాంగ్రెస్‌ నేతల ధర్నా.. రాహుల్‌ గాంధీ అరెస్టు

ఢిల్లీలో రాజ్ పథ్ వద్ద రోడ్డుపై బైఠాయించిన రాహుల్

rahul-gandhi-detained-during-cong-protest-against-sonia-gandhi-questioning

న్యూఢిల్లీః నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియాగాంధీ మరో సారి విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) తెలుపడంతో కాంగ్రెస్‌ శ్రేణులు ఆదోళనలను మరింత ఉధృతం చేశారు. ఢిల్లీలో పార్లమెంట్‌ నుంచి విజయ్‌చౌక్‌ వరకు కాంగ్రెస్‌ ఎంపీలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ఎంపీలు నిర్వహించిన ఈ భారీ ర్యాలీలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విజయ్‌చౌక్‌ వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి రాహుల్‌ గాంధీతో పాటు పలువురు ఎంపీలను అరెస్టు చేశారు. దీంతో పోలీసులతో రాహుల్‌ గాంధీ వాగ్వివాదానికి దిగారు. ధర్నా చేయడానికి తమకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని రాహుల్‌ పోలీసులను ప్రశ్నించారు. మోడీపై రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. మోడీ దేశాన్ని రాజులాగా పాలిస్తు్న్నారని ఆరోపించారు. తమపై కక్ష్యపూరింగా మోడీ సర్కార్‌ వ్యవహరిస్తోందని ఆరోపించారు.

కాగా, దీనిపై కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో స్పందించింది. గతంలో ఇందిరాగాంధీ ఇలాగే రోడ్డుపై బైఠాయించిన ఫొటోను, ప్రస్తుతం రాహుల్ రోడ్డుపై బైఠాయించిన ఫొటోను పక్కపక్కనే పెట్టి… ‘చరిత్ర పునరావృతం’ అంటూ క్యాప్షన్ పెట్టింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/