నేడు తెలంగాణకు రానున్న రాహుల్‌గాంధీ

హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈరోజు తెలంగాణకు రానున్నారు. నేటి సాయంత్రం శంషాబాద్ సమీపంలో జరిగే కాంగ్రెస్ కనీస ఆదాయ వాగ్దాన సభలో పాల్గొంటారు. రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న ఆయనకు ఘన స్వాగతం పలకడానికి, బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. రాహుల్ సభతో కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. సాయంత్రం 4.15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునే రాహుల్‌గాంధీ 4.30 గంటలకు బహిరంగసభలో పాల్గొంటారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయాండి:https://www.vaartha.com/telengana/