జ‌మ్మూక‌శ్మీర్‌లో రాహుల్ గాంధీ పర్యటన‌

ఖీర్ భవాని దుర్గా ఆలయంలో రాహుల్ పూజలు

శ్రీనగర్: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌ జమ్మూకశ్మీర్ వెళ్లారు. అక్కడ ఆయ‌న రెండు రోజుల పాటు పర్యటిస్తారు. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా సాయుధ భద్రతా దళాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జ‌మ్మూక‌శ్మీర్ పీసీసీ అధ్యక్షుడు ఘులాం అహ్మద్‌ మిర్ తో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలతో క‌లిసి ఆయ‌న త‌న ప‌ర్య‌ట‌న కొన‌సాగిస్తున్నారు. రాహుల్ గాంధీ మంగళవారం ఉదయాన్నే సెంట్రల్ కశ్మీరు జిల్లాలోని తుల్లముల్లా ప్రాంతంలోని చినార్ల మధ్య ఉన్న దేవాలయాన్ని సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో కలిసి రాహుల్ గాంధీ ఖీర్ భవానీ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

కాగా, రాహుల్ గాంధీ కాసేప‌ట్లో దాల్‌ సరస్సు ఒడ్డున ఉన్న హజ్రత్‌బల్‌ దర్గాకు వెళ్లి ప్రార్థ‌న‌ల్లో పాల్గొంటారు. ఆ తర్వాత‌, శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ భవన్‌ను ప్రారంభిస్తారు. అక్క‌డే పార్టీ నేతలు, కార్యకర్తలతో స‌మావేశం అవుతారు. ఈ రోజు సాయంత్రం తిరిగి ఢిల్లీ చేరుకుంటారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/