ద్రవిడ్‌ను వెంటాడుతున్న విరుద్ధ ప్రయోజనాల సెగ

Rahul dravid
Rahul dravid

ఢిల్లీ: గతంలో క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ టెండుల్కర్‌, వివిఎస్‌ లక్ష్మణ్‌ లాంటి క్రికెటర్లు కూడా పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఫిర్యాదుని ఎదుర్కొనవలసి వచ్చింది. ఈ విషయమై సచిన్‌, లక్ష్మణ్‌లు కూడా డీకే జైన్‌ ముందు హాజరయి వివరణ ఇచ్చారు. కాగా భారత మాజీ కెప్టెన్‌, జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సిఎ) చీఫ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా విరుద్ధ ప్రయోజనాల ఫిర్యాదుపై సెప్టెంబర్‌ 26న బిసిసిఐ ఎథిక్స్‌ అధికారి డీకె జైన్‌ వద్ద విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ద్రవిడ్‌ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం సభ్యుడు సంజీవ్‌ గుప్తా ఫిర్యాదు చేశారు. ఇండియా సిమెంట్స్‌లోని ఒక విభానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నాడని, భారత్‌-ఏ, అండర్‌-19 జట్లకు కోచ్‌గా వ్యవహరించారని, ప్రస్తుతం ఆయన ఎన్‌సిఎ అధినేతగా పనిచేస్తున్నారని ఇవన్ని కూడా విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తాయని సంజీవ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎథిక్స్‌ అధికారి ఎదుట హాజరయ్యారు. ఆ సమయంలో ఇండియా సిమెంట్స్‌ నుండి వేతనం ఇవ్వని సెలవు తీసుకున్నట్లుగా వివరణ ఇచ్చారు. కాగా ద్రవిడ్‌కు మద్దతు క్రికెట్‌ పాలక కమిటీ లేఖ రాసింది. బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కూడా పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా ద్రవిడ్‌ను నవంబర్‌ 12న మరోమారు తన ముందు హాజరు కావాలని ఎథిక్స్‌ అధికారి డీకె జైన్‌ ఆదేశించారు. స్పష్టమైన వివరణ ఇవ్వవలసిందిగా ద్రవిడ్‌ను డీకె జైన్‌ ఆదేశించినట్లు సమాచారం.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/