చెలరేగిన జూ. ద్రవిడ్‌… బ్యాట్‌తో, బంతితో

Rahul Dravid's son Samit
Rahul Dravid’s son Samit

బెంగళూరు: టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు చెలరేగిపోతున్నాడు. రెండు నెలల లోపే రెండు డబుల్ సెంచరీలు బాదిన సమిత్.. తాజాగా మరో డబుల్‌ను తృటిలో మిస్సయ్యాడు. సమిత్ బ్యాట్‌తోనే కాకుండా బంతితో కూడా అదరగొడుతున్నాడు. అండర్‌14 బీటీఆర్‌ షీల్డ్‌ టోర్నమెంట్‌లో విద్యాషిల్ప్‌ అకాడమీతో జరిగిన మ్యాచ్‌లో భారీ సెంచరీతో పాటు నాలుగు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. మాల్యా అదితి ఇంట్నేషనల్ స్కూల్, విద్యాశిల్ప్ అకాడమీ జట్ల జట్ల మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన మాల్యా జట్టు 50 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. సమిత్‌ ద్రవిడ్‌ 131 బంతుల్లో 166 పరుగులు చేశాడు. దీనిలో 24 బౌండరీలు ఉన్నాయి. సమిత్‌తో పాటు అన్వయ్‌ కూడా 90 పరుగులతో మెరిశాడు. అనంతరం బరిలోకి దిగిన విద్యాషిల్స్‌ 38.5 ఓవర్లలో 182 పరుగులకే కుప్పకూలింది. సమిత్‌ 35 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. సమిత్‌ ఆల్‌రౌండ్ షో చేసి తమ జట్టు మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్ సెమీఫైనల్స్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. సమిత్ బ్యాటింగ్‌పై మాల్యా అదితి ఇంట్నేషనల్ స్కూల్ ప్రశంసలు కురిపించింది. అంతకుముందు ఇదే టోర్నమెంట్‌లో సమిత్ ద్విశతకం బాదిన సంగతి తెలిసిందే.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/