రాహుల్‌ ద్రవిడ్‌కు అరుదైన గౌరవం…

Rahul Dravid
Rahul Dravid

క్యాంప్‌నౌ: టీమిండియా మాజీ కెప్టెన్‌, అండర్‌ 19 కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. క్యాంప్‌నౌ వేదికగా అట్టెటికో మాడ్రిడ్‌, బార్సిలోనా మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌కు రాహుల్‌ ద్రవిడ్‌ హాజరయ్యి ప్రత్యక్షంగా చూసారు. ఈ మ్యాచ్‌లో లియోనెల్‌ మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తున్న బార్సిలోనా జట్టు 2-0తో గెలుపొందింది. మెస్సీ, స్వారెజ్‌ చెరో గోల్‌ కొట్టారు. మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన ద్రవిడ్‌ను బార్సిడోనా యాజమాన్యం గౌరవించింది. మ్యాచ్‌ అనంతరం రాహుల్‌ ద్రవిడ్‌పేరుతో రూపొందించిన బార్సిలాోనా జెర్సీని ఆక్లబ్‌ అధ్యక్షుడు జోసెఫ్‌ మరియా ద్రవిడ్‌కు అందించారు.స్టార్‌లి§ెనల్‌ మెస్సీ గోల్‌ విన్యాసం ప్రత్యక్షంగా చూడటం మరపురాని అనుభాతి అని ద్రవిడ్‌ పేర్కొన్నాడు.


మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/