వన్డే ఫార్మాట్‌ కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత

ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో రాణించిన కేఎల్‌ రాహుల్‌ వన్డే ఫార్మాట్‌లో వెయ్యి పరుగులు సాధించాడు

K. L. Rahul
K. L. Rahul

రాజ్‌కోట్‌: వన్డే ఫార్మాట్‌లో టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ వెయ్యి పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో రాణించిన రాహల్‌..ఫలితంగా వన్డే ఫార్మాట్‌లో వేగవంతంగా వెయ్యి పరుగులు సాధించిన నాల్గో భారత ఆటగాడిగా నిలిచాడు. రాహల్‌ 27 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ సాధించగా, కోహ్లి, ధావన్‌ 24 మ్యాచ్‌ల్లో వెయ్యి పరుగులు సాధించారు. ఈ జాబితాలో నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ 25 మ్యాచ్‌ల్లో వెయ్యి వన్డే పరుగుల్ని సాధించాడు. కాగా రెండో వన్డేలో భారత్‌ మరియు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 36 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా విధించిన 341 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక ఆసీస్‌ చతికలపడింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 340 పరుగులు సాధించింది. శిఖర్‌ ధావన్‌ 96; 90 బంతుల్లో విరాట్‌ కోహ్లీ 78; 76 బంతుల్లో, కేఎల్‌ రాహుల్‌ 80; 52 బంతుల్లో, రోహిత్‌ శర్మ 42; 44 బంతుల్లో రాణించి భారత్‌కు భారీ స్కోర్‌ సాధించి పెట్టారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/