తాను చెప్పింది ఇప్పుడు నిజమైందన్న రాహుల్

ఆగస్టు 10లోపు దేశంలో 20 లక్షలు దాటుతుందన్న రాహుల్

rahul-gandhi

న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షల మార్కును దాటిన సందర్భంగా జులై 17న తాను చేసిన ట్వీట్‌ను ఆయన ఈ రోజు రీట్వీట్ చేశారు. ‘దేశంలో కరోనా 10 లక్షల మార్కును దాటింది. దేశంలో కరోనా విజృంభణ అధికంగా ఉంది. ఆగస్టు 10లోపు దేశంలో 20 లక్షల మందికి పైగా కరోనా సోకుతుంది. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం తప్పకుండా ప్రణాళికలు వేసుకుని, సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలి’ అని రాహుల్ గాంధీ అప్పట్లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ… ‘దేశంలో ఇప్పుడు కరోనా కేసులు 20 లక్షల మార్కును దాటాయి. మోడి ప్రభుత్వం మాయమైపోయింది’ అని ఆయన విమర్శించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/