గాయకుడు రహత్‌ ఫతే అలీ ఖాన్‌కు ఈడీ నోటిసులు

Rahat Fateh Ali Khan issued notice by ED for smuggling foreign currency
Rahat Fateh Ali Khan issued notice by ED for smuggling foreign currency

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రముఖ గాయకుడు రహత్‌ ఫతే అలీ ఖాన్‌ గత మూడేళ్లుగా విదేశి కరెన్సీని భారత్‌కు స్మగ్లింగ్‌ చేస్తున్నారంటూ ఆయనపై ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈమేరకు ఎఫ్‌ఈఎంఏ (ఫారిన్‌ ఎక్స్‌ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌) కింద ఆయనకు ఈరోజు నోటిసులు జారీ అయ్యాయి. ఈ అక్రమాల ద్వారా ఆయనకు 340,000 డాలర్లు (దాదాపు రూ.2.42 కోట్లు) ముట్టాయని వాటి నుంచి 225,000 (రూ.1.6 కోట్లు) స్మగ్లింగ్‌ చేశారని ఓ మీడియా వెల్లడించింది. ఈ కేసుపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఒకవేళ ఈ నోటీసులకు ఖాన్‌ స్పందించకపోతే ఈడీ ఆయనపై జరిమానా విధిస్తుంది. జరిమానా చెల్లించకపోతే ఆయనపై లుకౌట్‌ నోటీసులు జారీ అవుతాయి. దాంతో ఆయన భారత్‌లో ఎక్కడా ప్రదర్శనలు ఇవ్వడానికి వీలుండదు. పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందిన రహత్‌ ఫతే అలీ ఖాన్‌ తన గాత్రంతో భారత్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు.