ప్రశ్నిస్తున్నందుకు తనపై దేశద్రోహం కేసు పెట్టారు

ఏపీ సర్కారుపై రఘురామ విమర్శనాస్త్రాలు

అమరావతి : వైస్సార్సీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్ర సర్కారుపై మరోసారి స్పందించారు. ఏపీని రుణాంధ్రప్రదేశ్ గా మార్చుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఈ విధంగా అప్పులు చేసుకుంటూ వెళితే ఇబ్బంది పడేది ప్రజలేనని స్పష్టం చేశారు. లక్షల కోట్ల అప్పులపై ప్రశ్నించడం తప్పా? అని నిలదీశారు. ప్రశ్నిస్తున్నందుకే తనపై దేశద్రోహం కేసు పెట్టారని ఆరోపించారు.

ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్, పవన్ కల్యాణ్ కూడా ప్రశ్నిస్తున్నారని, వారిపైనా రాజద్రోహం కేసు పెడతారా? అని ప్రశ్నించారు. పరిస్థితులపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చినందుకే నన్ను శిక్షించారా? అని రఘురామ వ్యాఖ్యానించారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేనన్ని అప్పులు చేశారని విమర్శించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/