కృష్ణం రాజు ఫ్యామిలీ కి జగన్ అండ దండల అనేది రాజకీయ ఎత్తుగడే- RRR

MP Raghurama krishna Raju
MP Raghurama krishna Raju

కృష్ణం రాజు కుటుంబానికి ఏపీ సీఎం జగన్ అండ దండలు ఉంటాయని వైస్సార్సీపీ నేతలు చెప్పడం వెనుక రాజకీయ ఎత్తుగడ ఉందన్నారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. రెబెల్ స్టార్ కృష్ణం రాజు సెప్టెంబర్ 11న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కృష్ణం రాజు మరణ వార్త యావత్ సినీ లోకాన్నే కాదు రాజకీయ నేతలను సైతం షాక్ కు గురి చేసింది. కృష్ణం రాజు ఇక లేరు అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన మరణించి 20 రోజులు కావొస్తున్నా ప్రతి రోజు ఆయన గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. మొన్న (సెప్టెంబర్ 29 ) మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రులు హాజరై, కృష్ణం రాజు ఫ్యామిలీ జగన్ అండ దండలు ఉంటాయని అన్నారు. కాగా వైస్సార్సీపీ నేతల కామెంట్స్ ఫై రఘురామ కృష్ణరాజు విమర్శలు చేసారు.

కృష్ణంరాజు, పాన్ ఇండియా హీరో ప్రభాస్ కుటుంబానికి జగన్ అండదండలు అవసరమా అంటూ ప్రశ్నించారు. కృష్ణంరాజు మరణిస్తే ఆయన పార్దివ దేహాన్ని చివరి చూపు కూడా చూడడానికి వెళ్ళని జగన్.. ఇప్పుడు ప్రేమ ఒలకబోయడం వెనక రాజుల ఓట్లు గంపగుత్తగా వస్తాయన్న రాజకీయ ఎత్తుగడే కారణమై ఉంటుందన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారని.. బీజెపీలోనే కొనసాగుతున్న కృష్ణంరాజును ఆ కార్యక్రమానికి ఎందుకని ఆహ్వానించలేదని ప్రశ్నించారు. రఘురామకృష్ణ రాజులోని, కృష్ణంరాజు ఉందని ఆహ్వానించ లేదా అంటూ సెటైర్లు పేల్చారు. కృష్ణంరాజు సంస్మరణ సభ సందర్భంగా సుమారు 60 వేలమంది ప్రజలు హాజరైతే.. వారికి వివిధ రకాల మాంసాహార వంటకాలతో భోజనాలు వడ్డించారని గుర్తు చేశారు. ఆ వంటకాలకే ఆరేడు కోట్ల రూపాయలు ఖర్చయి ఉంటుందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సముద్రపు ఒడ్డున రెండు ఎకరాల్లో కృష్ణంరాజు గారి స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిందన్నారు. సముద్రపు ఒడ్డున 10 లక్షల రూపాయల విలువ కూడా చేయని రెండు ఎకరాల భూమిని.. భోజనాల కోసమే ఆరేడు కోట్ల రూపాయలను ఖర్చు చేసిన ప్రభాస్ కుటుంబం కొనుగోలు చేసి స్మృతి వనాన్ని అభివృద్ధి చేసుకోలేదా అన్నారు.