బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ గవర్నర్‌ పదవికి రాజన్‌ పోటీ!

raghuram rajan
raghuram rajan

లండన్‌: ప్రముఖ ఆర్ధికవేత్త, రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ యూకేలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ గవర్నర్‌ పదవికి పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన చికాగోలోని ఓ యూనివర్సిటీలో అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్నారు. గతంలో ఆయనకు ఐఎంఎఫ్‌లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. బ్రెగ్జిట్‌ నేపథ్యంలో ప్రస్తుతం బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ గవర్నర్‌గా ఉన్న మార్క్‌ కార్నే స్థానంలో కొత్త వ్యక్తిని నియమించనున్నారు. ఈ నియామకం అక్టోబరు 31లోపు జరగనుంది. ఈ పదవికి పోటీ పడుతున్న వారిలో రాజన్‌ ఒక్కరే యూకే వెలుపలి వ్యక్తి అని పలువురు ఆర్ధిక వేత్తలు ఈ విషయాన్ని పేర్కొన్నారు.
ముఖ్యంగా బ్రెగ్జిట్‌ ఓటింగ్‌ సమయంలో అయోమయంలో ఉన్న బ్రిటన్‌కు మద్దతుగా రాజన వ్యాఖ్యలు చేశారు. 2005లో ఐఎంఎఫ్‌లో ఉన్న సమయంలో ఆర్ధిక మాంద్యం ముప్పును ముందే ఊహించారాయన. తొలి రోజుల్లో దీనిపై విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన మాటలు నిజమని తేలడానికి ఎంతో కాలం పట్టలేదు. 2008లో సంభవించిన ఆర్ధిక మాంద్యం వల్ల లీమన్‌ బ్రదర్స్‌ వంటి కంపెనీలే కుప్పకూలడం గమనార్హం.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/