శ్రీవారిని దర్శించుకున్న దుబ్బాక విజేత
మొక్కులు చెల్లించుకున్న రఘునందన్ రావు

తిరుమల: దుబ్బాకలో బిజెపి విజయ సాధించిన విషయం తెలిసిందే. అయితే బిజెపి అభ్యర్థి రఘునందర్రావు ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారికి తలనీలాలు సమర్పించిన అనంతరం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. కాగా, అనూహ్య రీతిలో రఘునందర్రావు దుబ్బాక ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థిని సోలిపేట సుజాతపై గెలుపొందిన విషయం తెలిసిందే. అధికార టిఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాతను ఆయన రెండో స్థానానికే పరిమితం చేశారు. మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాసరెడ్డి నిలిచారు. తెలంగాణలో బిజెపి మరింత బలపర్చ డానికి ఈ విజయం తమలో జోష్ నింపిందని బిజెపి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/