జగనన్న క్యాంటీన్లను ప్రారంభించండి..రఘురామ

సీఎం జగన్ కు మరో లేఖ రాసిన రఘురామకృష్ణరాజు

అమరావతి: ఎంపీ రఘురామకృష్ణ రాజు సీఎం జగన్ కు మరో లేఖ రాశారు. రాష్ట్రంలో ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారని… వారికి మంచి ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లేఖలో ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న అన్న క్యాంటీన్ల స్థానంలో జగనన్న క్యాంటీన్లను తెరవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని చేపడితే మీకు మంచి పేరు వస్తుందని… దైవదూత అనే పేరు జనాల్లో స్థిరపడిపోతుందని చెప్పారు.

వెంటనే జగనన్న క్యాంటీన్ల పథకాన్ని ప్రారంభించాలని రఘురాజు కోరారు. వైయస్ జయంతి సందర్భంగా జగనన్న లేదా రాజన్న పేరుతో క్యాంటీన్లను ప్రారంభించాలని అన్నారు. పేదల ఆకలి తీర్చే ఈ కార్యక్రమం మానవత్వాన్ని ప్రదర్శించేందుకు మంచి వేదిక అవుతుందని చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/